రిషి కపూర్ ఆఖరి వీడియో.. గుండెల్ని పిండేస్తోంది
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఈ ఉదయం కన్నుమూశారు. అయితే మృతిచెందే చివరి క్షణాల్లోనూ రిషి కపూర్ సరదాగా మాట్లాడరని డాక్టర్లు తెలిపారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటికొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పటల్ బెడ్ పైన రిషి కపూర్ తో ఓ వ్యక్తి తీసిన సెల్ఫీ వీడియో అది. ఆ వ్యక్తి పాట పాడగా.. రిషి కపూర్ గొంతు కలిపారు. ఎంజాయ్ చేశారు. భాగోద్వానికి గురయ్యారు. పాట పాడిన వ్యక్తిని అభినందించారు. మొత్తంగా.. రిషి మొహంలో చిరునవ్వు… ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ వీడియోని చూసి ఆయన అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.
దాదాపు 50పైగా సినిమాల్లో రిషి కపూర్ హీరోగా నటించారు. పలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే గత రెండేళ్లుగా ఆయన క్యాన్సర్ తో పోరాడుతున్నారు. బుధవారం శాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన రిషి కపూర్.. చికిత్సపొందుతూ మృతి చెందారు. కొద్దిసేపటి క్రితమే ముంబైలోని మరీనా లైన్స్‌లోని చందన్‌వాడీ స్మశానవాటిలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు అంత్యక్రియలకి హాజరయ్యారు.
Someone sent me this.. could not hold my tears after watching it.. #RishiKapoor ji you will live in our hearts forever.. Legends never die.. pic.twitter.com/6JGDUWZ26v
— Sumit kadel (@SumitkadeI) April 30, 2020