తెలంగాణలో కరోనా కొత్త కేసులు 6
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత కొన్నిరోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రతిరోజు పదిలోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1043కి చేరింది. మరో 33 మంది మృతి చెందారు.
ఇప్పటి వరకూ కరోనా సోకి 464 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 552 మంది చికిత్స పొందుతున్నారు.ఇప్పటికే తెలంగాణలో 13 జిల్లాలు గ్రీన్ జోన్లుగా మారాయి. మరోవైపు కేంద్రం లాక్ డౌన్ ని మరో రెండు వారాలపాటు అంటే.. మే 17వరకు పొడగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ విషయానికొస్తే.. మరో వారం లాక్ డౌన్ పెరిగినట్టయింది. ఎందుకంటే.. ? తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం రెండు వారాల లాక్ డౌన్ పెంపుతో తెలంగాణ ప్రజలకి మరో వారం లాక్ డౌన్ పెరిగినటయింది.