బాలయ్య అఘోరా.. నిజమే !

బాలయ్య-బోయపాటిలది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. 

తాజాగా ఈ ప్రచారంపై దర్శకుడు బోయపాటి స్పందించారు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించనున్నారని వస్తున్న వార్తలు నిజమేనన్నారు. అయితే సింహా , లెజెండ్ చిత్రాల కంటే విభిన్నంగా ఓ మంచి సినిమాని ప్రేక్షకులను అందించనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా కోసం ఇద్దరు కొత్త కథానాయికలని తీసుకోబోతున్నామని.. ఇప్పటికే ఒకరు ఫిక్సయ్యారని బోయపాటి తెలిపారు.