రెండేళ్లయిన కరోనా వదిలిపెట్టదు
మహమ్మారి కరోనా ప్రపంచ చేశాలని వణికిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీని కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ కు సడలింపులు ఇచ్చి ఆర్థిక వ్యవస్థని పుంజుకోవాలనే ప్రయత్నాల్లో పలు దేశాలున్నాయి. అయితే ఇప్పట్లో కరోనా కంట్రోల్ కావడం కష్టమే. దాని ప్రభావం మరో రెండేళ్ల తర్వాత కూడా ఉంటుందని మిన్నోటెసా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్టియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చరిత్రలో ఇప్పటివరకు మానవాళి ఎదుర్కొన్న అనేక మహమ్మారులకంటే ఈ కరోనా చాలా ప్రమాదకరమైందని అభిప్రాయపడ్డారు. ఎవరికి వారు సొంతంగా జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు రక్షణ పొందగలుగుతారని తెలిపారు. మరోవైపు ఈ యేడాదికి చివరికల్లా కరోనాకి వాక్సిన్ రావొచ్చని చెబుతున్నారు. అయితే అది తగినంత రెడీ కావడం కష్టమే. అందరికీ అందుబాటులోకి తేవడం అంత ఈజీ కాదంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా జీవితంలో భాగంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి. మరీ.. కరోనాతో సహజీవనం చేస్తూ.. ప్రపంచం ముందుకు సాగడం సవాల్ తో కూడికున్నదే.