అజిత్ బర్త్ డే గిఫ్ట్.. లేదు ! 

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పుట్టినరోజు నేడు. అయితే అభిమానులకి అజిత్ పుట్టినరోజు కానుక ఏమీ ఇవ్వడం లేదు. అజిత్ కథానాయకుడిగా బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్.వినోత్ దర్శకుడు. అజిత్ పుట్టినరోజు కానుకాగా ఈ సినిమా నుంచి టీజర్, ఫస్ట్ లుక్ వచ్చేఅవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు.

 ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లేదని చిత్ర వర్గాలు అధికారికంగా తెలిపాయి. మరోవైపు తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించరాదని అజిత్ అభిమానులకు సూచించారు. అయితే సోషల్ మీడియా వేదికగా అజిత్ కి శుభాకాంక్షలు వెలెవెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అజిత్ ని విష్ చేస్తున్నారు.