బ్రేకింగ్ : మే17 వరకు లాక్ డౌన్ పొడగింపు

మే 3 తర్వాత కూడా దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేదా.. ?? అనే ఉత్కంఠకి కేంద్రం తెరదించింది. లాక్ డౌన్ ని మరో రెండు వారాలపాటు అంటే.. మే 17 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రీన్ జోన్లలో మినహాయిపులు ఇచ్చింది. 

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులుఇచ్చింది.  గ్రీన్ జోన్ ప్రాంతాలలో బస్సులను నడపవచ్చని పేర్కొంది. రెడ్ జోన్ లలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో పూర్తి ఆంక్షలు ఉంటాయి.  సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవడానికి వీల్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే లాక్ డౌన్ నుంచి పాక్షిక మినహాయింపులు ఇచ్చింది.