మెగాస్టార్ ‘మేడే’ ట్విట్
మెగాస్టర్ చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిండే. అప్పటి నుంచి పర్సనల్, సినిమాలు, సామాజిక అంశాలపై స్పందిస్తున్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
“ఈ రోజు మేడే. ప్రపంచాన్ని నిర్మించినది కార్మికులు. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్న మన దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులందరి గురించి ఆలోచించండి” అని మెగాస్టార్ ట్విట్ చేశారు.
కరోనా లాక్‌డౌన్ తో దేశ వ్యాప్తంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారిని సొంత రాష్ట్రాలకి పంపేందుకు ఇటీవలే కేంద్రం అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు లాక్‌డౌన్ నింబంధనల్లో మార్పులు చేసింది. అయితే ఈ సందర్భంగా తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించింది.
Its #MayDay today. It is the workers that built the world. This world labour day let's spare a thought about all the Migrant labor across our country who are facing an extraordinary situation.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2020