మరో బాలీవుడ్ నటుడి ఆరోగ్యం సీరియస్ ?
ఈ వారంలో బాలీవుడ్ కి వరుసగా షాకులు తగులుతున్నాయి. బుధవారం నటుడు ఇర్పాన్ ఖాన్ మృతి చెందారు. ఆ షాక్ లో ఉండగానే గురువారం దిగ్గజ నటుడు రిషీ కపూర్ కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఇలాంటి సమయంలో మరో బాలీవుడ్ నటుడుకి కూడా సీరియస్ గా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా ఆరోగ్యం బాగాలేదంటూ, హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై నసీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షా స్పందించారు. ‘ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నాన్నగారు బాగానే ఉన్నారు. దయచేసి ఆ వార్తలు ఎవరు నమ్మవద్దు’ అని కోరారు.