దేశంలో రెడ్ జోన్లు ఎన్ని ?

కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా జిల్లాలవారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది కేంద్రం. అయితే గతంలో రెడ్ జోన్లుగా ఉన్న జిల్లాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆరేంజ్, గ్రీన్ జోన్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జోన్లకి సంబంధించిన లెటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఓ ప్రకటన చేశారు.

కొత్త జాబితా ప్రకారం రెడ్ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్ జోన్ లో 284, గ్రీన్ జోన్ లో 319 జిల్లాలు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 19 జిల్లాలు, మహారాష్ట్ర లో 14, తమిళనాడు లో 12, ఢిల్లీ 11, పశ్చిమ బెంగాల్ 10 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.