కరోనాపై ఈ ఔషధం పనిచేస్తోంది
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారికి మందు లేదు. మందు కనిపెట్టే వరకు ఈ మహమ్మారిని కంట్రోల్ చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనాకి వాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తాము తయారు చేసిన రెమిడెసివిర్ ఔషధం చక్కగా పని చేస్తోందని కాలిఫోర్నియా(అమెరికా)కు చెందిన గిలీద్ సైన్సెస్ ప్రకటించింది. శరీరంలోకి చొరబడిన వైరస్ విశృంఖలంగా విస్తృతి చెందకుండా ఇది అడ్డుకట్ట వేస్తోందని తెలిపింది.
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సైతం గురువారం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. అయితే చైనాకి చెందిన ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ మాత్రం రెమిడెసివిర్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉందన్నారు. కరోనా చికిత్సకు పరీక్షించేందుకు పరిగణనలోకి తీసుకోదగ్గ ఔషధాల్లో రెమిడెసివిర్ ఒకటని ఆయన అన్నారు.