ఆన్‌లైన్‌లో మేడే వేడుకలు

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పండగలు, పబ్బాలు జరుపుకోలేని పరిస్థితి. ఈసారి మేడే వేడుకలకి కార్మికులు దూరం అయ్యారు. అయితే తెదేపా మాత్రం ఆన్ లైన్ లో మేడే వేడుకలని నిర్వహించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన నివాసం నుంచే ఆన్‌లైన్‌లో మేడే సందేశం ఇచ్చారు.

పసుపు జెండాలోని కార్మిక చక్రం స్ఫూర్తిగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్నా క్యాంటీన్లు, బీమా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, కార్మికుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బాబు ధ్వజమెత్తారు.