ఈ నెల 5న తెలంగాణ కేబినేట్ భేటీ
దేశంలో ఈ నెల 3తో లాక్డౌన్ ముగియనుంది. తెలంగాణలో మాత్రం ఈ నెల 7వరకు కొనసాగనుంది. మరీ.. మే 7 తర్వాతనైనా రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తేస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఈ నెల 5న తెలంగాణ క్యాబినేట్ భేటీ జరనుంది. ఈ సమావేశంలో లాక్డౌన్ ఎత్తివేతపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రం మొత్తం ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయడం కన్నా.. దశవారీగా లాక్డౌన్ ఎత్తేసే ప్లాన్ లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 11 జిల్లాల్లో కరోనా కేసులు లేవు. గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో డేంజర్ జోన్లో ఉన్నాయి. అయితే రెండు మూడు రోజులుగా సూర్యాపేట, గద్వాల, వికారాబాద్లో కూడా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో దశలవారీ సడలింపులతో లాక్డౌన్ను ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు హెలికాప్టర్ మనీపై కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.