ఆరోగ్యసేతుతో ఇబ్బందులుండవ్ : కేంద్రం
ఆరోగ్యసేతు యాప్ వాడకానికి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, దీంతో వ్యక్తిగత గోప్యత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేవకర్ స్పందించారు.
అరోగ్యసేతు యాప్ పూర్తిగా శాస్త్రీయబద్ధమైన సాధనమని, ఆ యాప్‌వల్ల వ్యక్తిగత గోప్యతకు వచ్చిన ముప్పేమీ లేదని జవదేకర్ స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా మనం కరోనా బారినపడకుండా కాపాడుకునే అవకాశం దక్కుతుంది తప్ప ఏ ఇతర సమస్య ఉండదన్నారు.
కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం ప్రపంచమంతా ఆరోగ్యసేతు యాప్‌ను ఎంచుకుంటోందని గుర్తు చేశారు.