బచ్చా.. మా అమ్మ దగ్గర నీ బటర్ ఉడకదురా
కరోనా లాక్‌డౌన్ కారణంగా సినీ తారలు ఇంటికే పరిమితమయ్యారు. ఇష్టమైన పనులు చేసుకొంటున్నారు. కొత్త పనులు ట్రై చేస్తున్నారు. ఇంటికే పరిమితమైన రామ్‌చరణ్ తన కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇటీవల తన భార్య కోసం డిన్నర్ సిద్ధం చేసిన చెర్రీ తాజాగా తన నానమ్మ అంజనాదేవి దగ్గర వెన్న తయారు చేయడం నేర్చుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియోని చరణ్ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వీడియోపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘మై డియర్ బచ్చా.. మా అమ్మ దగ్గర నీ బటర్ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. మీరు ఎంత బటర్ చేసినా.. అక్కడ మీ స్థానం బెటర్ అవ్వదు. కానీ అదే గ్యారంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో..!’ అంటూ సరదాగా అన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి.. ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరుకు జంటగా కాజల్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. How much ever you BUTTER, your position will not become BETTER. But … …అదే guarantee నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో 😜 https://t.co/x1AIBZR3lM
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 2, 2020