టాలీవుడ్’కు కరోనా లాస్ లెక్కెంతో తెలుసా ?

కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయ్. థియేటర్స్ బంద్ అయ్యాయి. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్స్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. కానీ థియేటర్స్ ఎప్పుడు తెరచుకుంటాయి అన్నది చెప్పలేం. ఈ యేడాదిలో థియేటర్స్ తెరచుకొని పరిస్థితులు లేవని అంచనే వేస్తున్నారు. ఒకవేళ థియేటర్స్ తెరచుకున్న జనాలు రారేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇక ఈ కరోనా సంక్షోభం వల్ల తెలుగు సినిమాకి కనీసం ఆరేడు వందల కోట్ల లాస్ అనే అంచనాలున్నాయి. దీని వల్ల బిజినెస్ కనీసం రెండు, మూడేళ్ల క్రితానికి రీసెట్ అవుతుందని చెబుతున్నారు. మరోవైపు కరోనాకి ముందు, తర్వాత అన్నట్టుగా సినీ పరిశ్రమలో భారీ మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

డిజిటల్ మీడియాదే భవిష్యత్. నేరుగా ఓటీటీలో సినిమాలు రిలీజ్ కానున్నాయి చెబుతున్నారు. ఇటీవల అమృతారామన్ సినిమా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. అదే దారిలో పలు చిన్ని, మీడియం సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం థియేటర్స్ తెరచుకొనే వరకు వెయిట్ చేసేలా ఉన్నాయి.