లాక్డౌన్ పొడగింపుపై కిషన్ రెడ్ది కామెంట్
మే 3 తర్వాత కూడా మరో రెండు వారాల పాటు అంటే.. మే 17 వరకు లాక్డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏకాభిప్రాయం తర్వాతే లాక్డౌన్ పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
శనివారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల నుంచే ఎక్కువ కేసులు వస్తున్నాయి. కంటైన్మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలి. 26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదు. 40 జిల్లాల్లో గత 21 రోజులుగా కేసు కూడా నమోదు కాలేదు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు తయారు చేశాం” అన్నారు.