హైదరాబాద్ రోడ్లపై పడ్డ కేటీఆర్

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 తర్వాత కూడా మరో రెండు వారాల పాటు అంటే.. మే 17 వరకు లాక్ డౌన్ ని పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా రెడ్ జోన్లలో లాక్ డౌన్ ని కొనసాగించి.. గ్రీన్, ఆరేంజ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ఎత్తేసే ఛాన్స్ ఉందనిచెబుతున్నారు.
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ రోడ్లని బాగుచేయాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ పనుల పురోగతిపై కేటీఆర్‌ సమీక్షించారు. నెల రోజుల పాటు రహదారుల పనుల్లో నిమగ్నం కావాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించిందని చెప్పారు.