నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు
కరోనా లాక్‌డౌన్ తో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. పర్సనల్, సినిమాలకి సంబంధించిన ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ‘మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఇచ్చింది.
‘నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు. అలాగే ఎలాంటి రిలేషన్‌లో కూడా లేను’ అని సమాధానం చెప్పింది. ప్రస్తుతం నిధి రిలేషన్ లో లేకున్నా.. గతంలో మాత్రం టీమిండియా క్రికెటర్ కె.ఎల్ రాహుల్ తో కలిసి తిరిగింది. వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ తనకి మంచి స్నేహితుడు మాత్రమేనన గతంలోనే నిధి క్లారిటీ ఇచ్చింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌శంకర్’ చిత్రంతో నిధి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న ‘భూమి’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. జయం రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణాంతర పనులు ముగించుకుని మే 8న విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.