భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ?

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆయన ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కూడా అంతే. ఆయన నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు రావొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే బాలీవుడ్ గ్రేట్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నుంచి తారక్ కి ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా భన్సాలీ ఓ పిరియాడికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కథాయకుడు కాగా, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రతినాయకుడుగా కనిపిస్తారని చెప్పుకొంటున్నారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ, పౌరాణినికం.. ఏదైనా తారక్ కి కొట్టిన పిండి. ఇంకా చెప్పాలంటే సింగిల్ టేక్ నటుడు. అందుకే చాన్నాళ్ల నుంచి ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని భన్సాలీ భావిస్తున్నారంట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో పేరు రావడం ఖాయం. అందుకే తారక్ సినిమా చేయడం ఇదే సరైన సమయమని భన్సాలీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. స్వాత్రంత్య్ర సమరయోధులు అల్లూరి, కోమరం భీమ్ ల కథతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్, కోమరం భీమ్ తారక్ నటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా తర్వాత భన్సాలీ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండొచ్చని చెబుతున్నారు.