‘రౌడీ’ ట్యాగ్ ఎలా వచ్చిందంటే ?

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండకి ‘రౌడీ హీరో’ అనే బిరుదు ఉంది. ఆయన కూడా అభిమానులని ‘రౌడీస్’ అని పిలుస్తుంటారు. ఏ వేదికపైన విజయ్ మాట్లాడిన ‘మై డియర్ రౌడీ బాయ్స్ & అండ్ గర్ల్స్.. ‘ అని సంభోదిస్తుంటారు. ఇంతకీ ఈ రౌడీ ట్యాగ్ లైన్ ఎలా వచ్చింది ? దాని వెనక కథేంటీ ?? అన్నది ఓ ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ వివరించారు.

“నన్ను ప్రేమించే వారిని ‘ఫ్యాన్స్’ అని పిలవడం నాకు అసౌకర్యంగా అనిపించింది. అందుకు ప్రత్యామ్నాయంగా మరో పదం కావాలనుకున్నా. అందులోనూ నన్ను ఇష్టపడేవారంతా నా వయసు వారే అందుకే.. ‘మై రౌడీ బాయ్స్‌, మై రౌడీ గర్ల్‌’ అని పిలుస్తుంటా. అలా ఆ ట్యాగ్‌ వచ్చింది. జీవితంలో అనేక మంది మనల్ని నియంత్రించాలని చూస్తుంటారు. ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలానే చెయ్‌.. అంటుంటారు. కానీ మనకు నచ్చినట్లు మనం బతకాలని నేనంటా. అందర్నీ అలానే ఉండమని కోరుతుంటా. దీనర్థం ఇతరుల్ని నొప్పించమని కాదు, హాని చేయమని కాదు.. స్వేచ్ఛగా నచ్చినట్లు జీవించాలని. నాలోని ఆ గుణమే ఇవాళ ఈ స్థాయిలో ఉంచింది. ఇలా
‘రౌడీ’ల్లా ముందుకు వెళ్లాలని నేను సూచిస్తుంటా. అలా ఆ పదం వచ్చింది” అని చెప్పారు.

ప్రస్తుతం విజయ్ ‘ఫైటర్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అనన్య పాండే హీరోయిన్. ఈ చిత్రానికి బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారమ్.