1300 ఉద్యోగులని తొలగించిన టీటీడీ

కరోనా ఎఫెక్ట్ తో ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయ్. జీతాల్లో కోత పడుతున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా 1300 మంది ఒప్పంద కార్మికులను తొలగించింది.

వీరంతా తిరుమలలో పారిశుద్ధ్యకార్మికులుగా, మెయింటెనెన్స్‌ సిబ్బందిగా పనిచేస్తున్నారని, ఏప్రిల్‌ 30తో వారి ఒప్పంద గడువు ముగియడంతో వారిని కొనసాగించడానికి తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) అధికారులు సిద్ధంగా లేరు. కార్మికులను సప్లయ్‌ చేసే సంస్థ దేవస్థానంతో కుదుర్చుకున్న ఒప్పందం గత నెల 30న ముగిసిందని, దాన్ని కొనసాగించే అవకాశం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.