మద్య తయారీకి అనుమతి
దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి మద్యం షాపులు తెరచుకోనున్నాయి. మొదట గ్రీన్, ఆరేంజ్ జోన్లలో మాత్రమే మద్యం షాపులకి కేంద్రం అనుమతిని ఇచ్చినా.. ఇప్పుడు రెడ్ జోన్లలోని స్వంతంత్ర మద్యం షాపులకి కూడా కేంద్రం అనుమతిని ఇచ్చింది.
మద్యం అమ్మకాలకి కేంద్రం నుంచి అనుమతిని ఇవ్వడంతో మద్యం తయారీకి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నుండి ముందస్తు అనుమతులు తీసుకుని ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలు అమలు చేస్తూ డిస్టిలరీలు ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. దీంతో ఆదివారం నుండి రాష్ట్రంలోని 20 డిస్టలరీలు పని చేయనున్నాయి. మద్యం తయారీ సమయాల్లో కార్మికులు సామాజిక దూరం పాటించాలని ఆదేశించింది.