ఏపీ ప్రభుత్వం.. రెండు సంచలన నిర్ణయాలు !

ఏపీ ప్రభుత్వం రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఉద్యోగ అర్హతని ఇంటర్మీడియేట్ గా మార్చింది. దీంతో పాటు అకడమిక్ క్యాలెండర్ లో మార్పులు చేసింది.

సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరంగా ఉండేది. అయితే కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఈ ఏడాది ఆగష్టు నుంచి 2021 జులై వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక కరోనా వైరస్ వల్ల మార్చి 3 వ వారం నుంచి విద్యార్థుల చదువులకు బ్రేక్ పడింది. పరీక్షలు ముగియకుండానే అర్ధాంతరంగా విద్యాసంవత్సరం ముగిసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించకుండానే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతి, డిగ్రీ, పీజీ, ప్రవేశపరీక్షలు.. నిర్వహించాల్సి ఉంది.