మద్యం షాపులపై సీఎం కేసీఆర్ నిర్ణయం ఏంటంటే ?
మే 3 తర్వాత కూడా మరో రెండు వారాల పాటు అంటే.. మే 17 వరకు కేంద్రం లాక్ డౌన్ ని పొడగించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ 3.ఓ లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా మద్యం షాపులకి అనుమతిని ఇచ్చింది. ఆరేంజ్, గ్రీన్ జోన్లలో షరతులతో కూడిన మద్యం అమ్మకాలకి ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తిగా మారింది.
కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ విధించినప్పుడే.. తెలంగాణలో లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మే 5న మరోసారి కేబినేట్ సమావేశం నిర్వహించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే కేంద్రం లాక్ డౌన్ మే 17 వరకు పొడగించిన నేపథ్యంలో.. మద్యం షాపులకి అనుమతి సీఎం కేసీఆర్ అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. సోమవారం నుంచి వైన్స్ షాపులను తెరచుకునేందుకు అనుమతించాలా.. ? వద్దా..?? అన్న విషయమై సీఎం కేసీఆర్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ జోన్లలో మాత్రమే మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.