షమీ ఆత్మహత్యా ప్రయత్నం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆత్మాహత్యా ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా క్రీడాకారులు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాల్లో టీమిండియా ఆటగాళ్లు సహచరులు, మాజీ క్రెకెటర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు.
ఆట, జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా రోహిత్‌శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన షమీ ఓ షాకింగ్ విషయం చెప్పారు. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించానన్నారు. 2015 ప్రపంచకప్ తర్వాత తన కేరీర్ చాలా ఒడిదుడుకులకు గురైంది.
గాయాల నుంచి కోలుకోవడానికి యేడాదిన్నర సమయం పట్టింది. దీనికితోడు వ్యక్తిగత సమస్యలు అధికమయ్యాయ్. దీంతో మూడు సార్లు ఆత్మహత్యకు పాల్పడాలన్న ఆలోచన వచ్చింది. అయితే తన కుటుంబ సభ్యల అండతో తాను గడ్డు పరిస్థితుల నుంచి బయటపడినట్టు షమీ వివరించారు.