నయన్ గుండె మరోసారి ముక్కలైందా ?
స్టార్ హీరోయిన్ నయన్ ప్రేమ వ్యవహారాల గురించి తెలిసిందే. మొదట శింబు, ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది. ఈ రెండు ప్రేమకథలు ఫెయిల్ అయ్యాయ్. ఆ రెండు సందర్భాల్లోనూ తన గుండె ముక్కలైందని ఓ ఇంటర్వ్యూలో నయన్ చెప్పింది. తాజా సమాచారమ్ ప్రకారం నయన్ గుండె మరోసారి ముక్కలైందట.
ప్రస్తుతం నయన్ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విగ్నేష్ తో ఐదేళ్లుగా సహజీవనం చేస్తుంది. కానీ పెళ్లి ఊసెత్తడం లేదు. సినిమాలకు షికార్లకు, విదేశాల్లో బర్త్ డే పార్టీలు అమ్మో చాలానే చేసున్నారు.పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు.
లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? విగ్నేశ్ తో నయన్ కి చెడింది. వీరిద్దరు గత కొంతకాలంగా పెడ మొహంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నయన్-విగ్నేష్ విషయంలో ఇలాంటి ప్రచారం కొత్తేమీ కాదు. ఇలా ప్రచారం జరిగినప్పుడల్లా మా ప్రేమ గొప్పదని కలిసి దిగిన ఫోటోల షాక్ ఇస్తోంది.. ఈ జంట. ఈ సారి కూడా అదే జరుగుతుందేమో.