నిఖిల్ పెళ్లి.. మరోసారి వాయిదా !
యంగ్ హీరో నిఖిల్ పెళ్లి మళ్లీ వాయిదా పడింది. పల్లవి వర్మ అనే వైద్యురాలితో నిఖిల్ పెళ్లి ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న జరగాల్సి వీరి వివాహ వేడుక కరోనా లాక్ డౌన్ తో మే 14కి వాయిదా పడింది. ఇప్పుడు లాక్ డౌన్ ని మే17కి పొడగించడంతో.. మరోసారి పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ తెలిపారు.
“ఏప్రిల్ 16న వివాహం జరిపించాలని మా పెద్దలు నిర్ణయించారు. లాక్ డౌన్ కారణంగా అది మే 14కు వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ ను మే17 వరకూ పొడిగించారు. నిరాశకు గురయ్యాను. అయితే నా పెళ్లి వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది వచ్చినా నేను సంతోషంగా ఉండలేను. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కాబట్టి అది మంచిగానే ఉండాలని ఆశిస్తున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అందుకే పెళ్లిని మరోసారి వాయిదా వేసుకున్నా. లాక్ డౌన్ ఎత్తేశాక.. ఘనంగా పెళ్లి చేసుకుంటా” అని తెలిపారు నిఖిల్.