రెడ్ జోన్లలోనూ మద్యం షాపులకి అనుమతి
మే 3 తర్వాత మరో రెండు వారాలు అంటే.. మే 17 వరకు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆరేంజ్, గ్రీన్ జోన్లకి సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ రెండు జోన్లలో మద్యం అమ్మకాలకి కేంద్రం అనుమతిని ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కేంద్రం విడుదల చేసింది.
ఈ గైడ్ లైన్స్ లో రెడ్ జోన్లలో లిక్కర్ షాపులు తెరడంపై బ్యాన్ విధిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లిక్కర్ షాపులు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు సృష్టం చేసిన హోంశా,. రెడ్ జోన్లలోని స్వత్రంత్ర మద్యం షాపులు లేదా కాలనీల్లో ఉన్న లిక్కర్ స్టోర్ లకి మాత్రం అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. దీంతో రెడ్ జోన్ లలోనూ మద్యం అమ్మకాలు జరగనున్నాయి.