ఏపీలో కొత్తగా 67కేసులు

ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజూకి కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 491కి చేరింది. గుంటూరులో 19 కేసులు నమోదు కాగా.. ఆ జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య 338కి చేరుకుంది. ఇక ఏపీలో ఇప్పటి వరకూ 524 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1093 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు, కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఈరోజు ఏపీలో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే మందుబాబులు మద్యం దుకాణాలకి బారులు తీరారు. ఈ సందర్భంగా సామాజిక దూరాన్ని పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో జనాలు బారిగా రోడ్లమీదకి వస్తున్నారు. బందరు రోడ్డుపై బారీగా జనాలు గుమికూడారు. అసలే రోజురోజూకి కరోనా విజృంభిస్తున్న ఏపీలో తాజా సడలింపులతో పరిస్థితి చేజారేలా కనిపిస్తోంది.