బండి మరో డౌటు
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గడంపై తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కరోనా నిర్థారణ పరీక్షలని తగ్గించింది. అందుకే కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా బండికి మరో డౌటు వచ్చింది.
రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్యను, మరణాలను ప్రభుత్వం తగ్గించి ప్రకటిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి వివరాలను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. చనిపోయిన శవాల నమూనాలను సేకరించేందుకు అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. రంజాన్ పేరుతో లాక్‌డౌన్‌ను ధిక్కరించి తిరుగుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.