టార్గెట్ జీహెచ్ఎంసీ
తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో తప్ప.. మిగితా ప్రాంతాల్లో కరోనా దాదాపు కంట్రోల్ కి వచ్చేసింది. గత కొన్నిరోజులుగా తెలంగాణలో కరోనా కొత్త కేసుల నమోదు భారీగా తగ్గింది. ప్రతిరోజూ పదిలోపే కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అవి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నాయి.
ఆదివారం మాత్రం కరోనా కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. 21 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 కేసులు గ్రేటర్ లోనే నమోదయ్యాయి. ఒక కేసు జగిత్యాలలో నమోదైంది. ఈ నేపథ్యంలో మే 7 తర్వాత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా.. సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ని టార్గెట్ గా పెట్టుకొని నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. బహుశా.. గ్రేటర్ హైదరాబాద్ లో ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా.. మిగితా ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 1082 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 29మంది కరోనాతో మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 545 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 508 మంది చికిత్స పొందుతున్నారు.