లాక్ డౌన్ 3.0 సడలింపులు.. డేంజర్ !

కరోనా కట్టడి కోసం దేశంలో మార్చి 25 నుంచి లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. తొలి విడత లాక్ డౌన్ 21రోజులు పాటు (ఏప్రిల్ 14) కొనసాగింది. తొలి విడతలో ఎలాంటి సడలింపుల్లేవ్. ఇక రెండో విడత లాక్ డౌన్ ని మరో 19రోజుల పాటు అంటే మే 3 వరకు విధించారు. అయితే రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి కొద్దిమేర సడలింపులు ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత లాక్ డౌన్ లో మాత్రం గ్రీన్, ఆరేంజ్ జోన్లలో భారీగా సడలింపులు ఇచ్చారు. రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు వంటి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది చాలా డేంజర్ అంటున్నారు.

ఎందుకంటే.. ? మార్చి 25న తొలి లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న 606 కేసులు రెండో లాక్ డౌన్ ముగిసే నాటికి 40,263కి పెరిగాయి. 40 రోజుల్లో కేసులు 66 రెట్లు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తగా ఈ నెల 17 వరకు మరో విడత లాక్ డౌన్ ప్రకటించింది. అయితే లాక్ డౌన్ 3.0లో భారీగా సడలింపులు ఇవ్వడమే ఆందోళన కలిగిస్తోంది. పెద్దగా సడలింపులు లేకుండా సాగిన రెండు విడతల లాక్ డౌన్స్ లో ఏకంగా 66రెట్లు కరోనా కేసులు పెరిగాయి. ఇప్పుడు భారీగా సడలింపులతో కొనసాగనున్న లాక్ డౌన్ 3.0 లో కేసులు విజృంభణ ఓ రేంజ్ లో పెరిగితే పరిస్థితి ఏంటీ ? అనేది అర్థంకావడం లేదు.