నివేదా అధికారిక పేజీ ఇదే.. !

సోషల్‌మీడియాలో నటీనటులకు సంబంధించి నకిలీ అకౌంట్లు ఉండడంతో చాలామంది బోల్తాపడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నివేదా పేతురాజు తన ట్విటర్‌ ఖాతా గురించి అభిమానులకు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్‌ చేశారు.

“హాయ్‌ ఆల్‌, ట్విటర్‌లో ఎన్నో నకిలీ ఖాతాలు ఉంటున్నాయి. నాకు ట్విటర్‌ ఖాతా ఉంది. @Nivetha_Tweets అనేది మాత్రమే నా అధికారిక ట్విటర్‌ పేజీ. నకిలీ ఖాతాలను ప్రోత్సహించకండి. నా ట్విటర్‌ పేజీకి కూడా త్వరలోనే అధికారిక గుర్తింపు పొందడం కోసం చూస్తున్నాను. థ్యాంక్యూ” అని నివేదా పేతురాజు తెలిపారు.

ఈ ఏడాది ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో విజయం అందుకున్నార్ నివేదా. ప్రస్తుతం ఆమె రామ్‌ ‘రెడ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నివేదా ఇన్‌స్పెక్టర్‌ యామిని పాత్రలో కనిపించనున్నారు.