వారంలోనే కరోనాపై విజయం
కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. భారత్ లోనూ కరోనా వేగంగా విజృంభిస్తోంది. దాన్ని కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వంలో మూడో దఫా లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే. మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కరోనా నుంచి కోలుకునే రేటు.. సంక్రమణ రేటు కన్నా ఎక్కువగా ఉండటం సంతోషించదగ్గ విషయం.
కరోనా సోకిందని కంగారు పడాల్సిందేమీ లేదు. వారం రోజుల్లోనే కరోనా నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు. ఆరోగ్యవంతులు వారంరోజుల్లోనే కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఏపీలో గుంటూరు జిల్లాలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటి వరకు 319 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 115మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 35-40 మధ్య వయసువారు కేవలం వారం రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.