సినీ పరిశ్రమకి కూడా అనుమతి ఇవ్వండి
ఈరోజు నుంచి లాక్డౌన్ 3.ఓ ప్రారంభం అయింది. మూడో దఫా లాక్డౌన్ లో 17 పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా సినీ పరిశ్రమకి కూడా అనుమతి ఇవ్వాలనే విజ్ఝప్తులు వస్తున్నాయి. ఈ మేరకు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ముఖ్యమంత్రి పళనిస్వామికి లేఖ రాశారు. చిత్ర పరిశ్రమకు, బుల్లితెరకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.
రీ రికార్డింగ్, డబ్బింగ్ వంటి నిర్మాణానంతర పనులకు, అలాగే బుల్లితెర చిత్రీకరణలకు అనుమతి ఇవ్వాలని కోరారు. తద్వారా సమాఖ్యలోని 40, 50 శాతం కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే తరహా తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఝప్తి చేయాలని టాలీవుడ్ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారమ్. సామాజిక దూరం పాటిస్తూ సినిమా పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని కోరనున్నారు.