‘పుష్ప’ కమర్షియల్ నే.. కానీ !

అల్లు అర్జున్-సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం ముగియగానే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఎర్ర చందనం స్లగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తిగా లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు.

బన్నీ బర్త్ డే కానుకగా వచ్చిన పుష్ప ఫస్ట్ లుక్ లో బన్నీ ఊరమాస్ లుక్ లో ఉన్నాడు. దీంతోఇదో ప్రయోగాత్మక సినిమా అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇది పక్కా కమర్షియల్ చిత్రమేనట. కానీ అభిమానులు బన్నీ నుంచి కోరుకునే స్టయిలీష్ డ్యాన్స్ మూమెంట్స్ ఉండవని చెబుతున్నారు. కాకపోతే.. ఐటమ్ సాంగ్ లో బన్నీ మాస్ స్టెప్పులని చూడొచ్చు. ఇక పుష్ప ఐటమ్ భామగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్టు తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా పుష్ప రాబోతుంది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక మందన కనిపించనున్నారు. బన్నీ లవ్వర్ పాత్రలో నివేదా థామస్ కనిపిస్తారనే ప్రచారం ఉంది. అనసూయ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు కనిపిస్తారనే ప్రచారం ఉంది. దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.