మద్యం షాపుల వద్ద బారులు.. టీడీపీ పనేనా ?
మూడో విడత లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం మద్యం షాపులకి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరచుకున్నాయి. తెలుగు రాష్ట్రం ఏపీలోనూ మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయ్. అయితే ఏపీలోని మద్యం దుకాణాల వద్ద సీన్స్ యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఓ జాతరలా జనాలు మద్యం షాపులకి క్యూ కట్టారు. లాక్‌డౌన్ నిబంధనలని తుంగలో తొక్కారు.
మందుబాబులు షాపుల ముందు భౌతిక దూరం పాటించకుండా క్యూలు కట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీంతో సీఎం జగన్ సర్కార్ కి చెడ్డ పేరు వచ్చిమ్ది. ఇన్నాళ్లు కరోనా కోసం చేసిన కష్టం అంతా ఇలాంటి పనులతో బూడిద పాలవుతుందని ప్రతిపక్షాలు విమర్శించారు. వారి ఆరోపణలని తిప్పికొట్టే క్రమంలో ఏపీ మంత్రులు కొత్త వాదనని తెరకపైకి తీసుకొచ్చారు.
సోమవారం మద్యం షాపుల వద్ద బారులు తీరడం వెనక టీడీపీ కుట్ర ఉంది. టీడీపీ కార్యకర్తలే మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ప్రభుత్వానికి చెడ్దపేరు వచ్చేలా వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో వైరల్ చేశారని పలువురు మంత్రులు ఆరోపిస్తున్నారు. మంత్రుల ఆరోపణలు వినడానికి నమ్మశక్యం కావడం లేదు. కానీ, నిజంగానే దీని వెనక ఇంత కుట్ర కోణం ఉండి ఉంటుందా ? అనే ఆలోచనలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.