సీఎం కేసీఆర్’పై కాంగ్రెస్ ఎటాక్

సీఎం కేసీఆర్ మీడియా ముందుకొస్తే ఎట్లుట్టదో తెలిసిందే. ప్రతిపక్షాల గూబగుయ్ మంటది. మంగళవారం మీడియా ముందుకొచ్చిన సీఎం కేసీఆర్.. ప్రతిపక్షాలని ఓ రేంజ్ లో వేసుకున్నాడు. అసలు ప్రతిపక్షం ఉన్నది. సన్యసులు, యెదవలు.. ఈ కఠిన సమయానల సలహాలు ఇవ్వడం మానేసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ తిట్లు కాంగ్రెసోళ్లకి బాగానే కాలింది. మంట మంట అంటూ మీడియా ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ పై కౌంటర్ ఎటాక్ చసే ప్రయత్నం చేశారు. కేసీఆరే అతి పెద్ద బఫూన్‌ అంటూ ఎద్దేవా చేశారు సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ప్రతిపక్షాలపై సీఎం వాడిన భాషను ఖండిస్తున్నామని చెప్పారు. కరోనాపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలోనే చెప్పామని, పట్టించుకోకుండా కేసీఆర్‌ ఎగతాళిగా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ మరో సీనియర్ నేత షబ్బీర్‌ అలీ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. 

ప్రధాని, సీఎం మాటలకు విలువ ఇచ్చి లాక్‌డౌన్‌ నిబంధనల్ని పాటించామని, ప్రెస్‌మీట్‌ తర్వాత కేసీఆర్‌ పిట్టల దొరలా కహానీలు చెప్పారని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ మండిపడ్డారు. రైతుల్ని ఆదుకోవాలని అంటే మమ్మల్ని పిచ్చోళ్లు అంటున్నారని దుయ్యబట్టారు. కరోనా బాధితుల గురించి నిజాలు దాస్తున్నారని, టెస్టింగ్‌ కిట్లు లేకుండా పాజిటివ్‌ ఎలా నిర్థారిస్తున్నారు? అని ప్రశ్నించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి లాడ్జిలా ఉందని తమ వైద్యులు చెప్పారని షబ్బీర్‌ అలీ తెలిపారు.