డేంజర్ : కరోనాలో ముళ్లు పెరుగుతున్నాయ్.. మరింత బలంగా మారుతోంది

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ అధ్యయనాలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా అమెరికాలోని లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో కరోనా మరింత  బలంగా మారినట్లు వెల్లడయింది.

కరోనా వైరస్ ముళ్ల ఆకారణంలో ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిపై ముళ్లు పెరుగుతున్నాయి. దానివలన అది మరింత బలంగా మారుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బలంగా మారిన ఈ మహమ్మారి వైరస్ ఒక వ్యక్తికి వ్యాపించడమే కాదు.. ఆ వ్యక్తి ఒకసారి కరోనా వైరస్ బారి నుంచి బయట పడ్డ తర్వాత మరోసారి కూడా ఆ వ్యక్తికి సోకే ప్రమాదం ఉందనే షాకింగ్ నిజాలు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిందని తెలుస్తోంది. కరోనాలో కొత్తగా ఏర్పడిన ముళ్ల కారణంగా ఊపిరితిత్తులలో వున్న కణాలకి ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతుందని చెబుతున్నారు.