బ్రేకింగ్ : టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతి

టీవీ సీరియల్స్ షూటింగ్స్ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం. అయితే అది ఇక్కడ కాదు. కర్నాటకలో. కర్నాటక సీఎం యడియూరప్ప సీరియల్స్ షూటింగ్స్ కి అనుమతిని ఇచ్చారు. షూటింగ్‌లో 12 మంది మాత్రమే ఉండాలి, బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌లకు అనుమతి లేదనే కండిషన్స్ పెట్టింది. అంతేకాదు.. గ్రీన్ జోన్లలో మాత్రమే షూటింగ్స్ నిర్వహించుకోవాలని తెలిపింది. 
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్ రెండో వారం నుంచి షూటింగ్స్ అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

మంగళవారం సినీ నిర్మాతలు మంత్రి తలసాని శ్రీనివాస్ ని కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముందు షూటింగ్స్ కి షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి తలసాని సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. జూన్ రెండో వారం నుంచి షూటింగ్స్ అనుమతులు ఇచ్చేందుకు సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు.