పవన్’తో జల్సాపై క్లారిటీ ఇచ్చిన పూనమ్
హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాల కంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యవహారంతో ఫేమస్ అయిపోయింది. పవన్ తో ఈ ముద్దుగుమ్మకి ఎఫైర్ ఉందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో నిజమెంతో తెలీదు. కానీ పవన్ పై ప్రేమతో.. అదే సమయంలో ద్వేషం ఉన్నట్టు పూనమ్ ట్విట్స్ ని చూస్తే అర్థమయ్యేది. పవన్ అంటే పూనమ్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నమాట. తాజాగా పవన్ తో జల్సా విషయంపై పూనమ్ క్లారిటీ ఇచ్చింది.
పవన్ – త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘జల్సా’లో పూనమ్ కౌర్ నటిస్తుందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ఈ వార్తల్ని అప్పట్లో లైట్ తీసుకున్న పూనమ్ ఇప్పుడు స్పందించింది.
“ఎన్నికల సమయంలో నా గురించి చాలా పుకార్లు వినిపించాయి. ‘జల్సా’ చిత్రంలో అవకాశం దక్కలేదనే కారణంతో నేను ఆవేదనకు గురైనట్టు ప్రచారం జరిగింది. అవన్నీ తప్పుడు వార్తలు. ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప మరే దర్శకుడితోనూ తాను పనిచేయాలని కలలు కనలేదు” అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.