మందు బాబులపై రష్మీ ఫైర్

మూడో విడత లాక్ డౌన్ లో కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మందు కొనుక్కోడానికి మందు బాబులు మద్యం షాపులకి బారులు తీరుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా మందు బాబులపై సోషల్ మీడియా వేదికగా యాంకర్ రష్మీ ఫైర్ అయింది. మద్యం కోసం బయటకు వచ్చే ప్రతీ ఒక్కరిపై స్టాంప్ వేయాలని, అలాంటి వారికి ఎవ్వరూ సాయం చేయోద్దని, ప్రభుత్వం నుంచి అందే ఏ సాయం కూడా అతనికి చేరొద్దని తెలిపింది. కనీసం అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఉండవు. కానీ మందు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అంటూ రష్మీ ఫైర్ అయింది.