విరాట్ ఇంట్లో విషాదం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట్లో విషాదం నెలకొంది. 11 ఏళ్ళ నుండి ఎంతో అపురూపంగా పెంచుకున్న పెంపుడు కుక్క బ్రూనో మృతి చెందింది. దీంతొ విరాట్-అనుష్క దంపతులు భావోద్వేగానికి గురయ్యారు.

విరాట్ తన ట్విట్టర్ ఖాతాలో బ్రూనో ఫోటో షేర్ చేశారు. “11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ఈరోజు ఇక్కడి నుంచి మరో మంచి చోటుకు వెళ్లావు. నీ ఆత్మకు శాంతి చేకూరేలాని దేవుడుని కోరుకుంటున్నా”నని రాసుకొచ్చారు. అనుష్క శర్మ సైతం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో “మిస్ యూ బ్రూనో.. రిప్” అంటూ పోస్టు చేసింది.