తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు.. నిబంధనలు ఇవే !
పదో తరగతి పరీక్షలపై క్లారిటీ వచ్చేసింది. ఈ నెలలోనే మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలని నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలని పాటిస్తూనే పదో తరగతి పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 20మందిని కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షల కోసం వచ్చే వాహనాలని అనుమతినిస్తాం. ధనువంతుల పిల్లల కోసం కార్లని కూడా అనుమతిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. మే 17న లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒక గదిలో కేవలం 12 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టనుందని సమాచారం. ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి ఆరడుగుల దూరం ఉండటంతో పాటు ఒక్క్ బెంచ్ కు ఒక విద్యార్థి మాత్రమే కూర్చునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుందని తెలుస్తోంది.