ఏపీ కంటే తెలంగాణ చాలా బెటర్

మూడో విడత లాక్‌డౌన్ లో కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరచుకున్నాయి. ఏపీలో సోమవారమే మద్యం షాపులు తెరచుకోగా, తెలంగాణలో ఈరోజు మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. అయితే ఏపీలో మద్యం షాపులు తెరచుకున్న మొదటిరోజు మందు బాబులు బారులు తీరారు. ఆ దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. అవి చూసి.. దేశం, అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు షాక్ తిన్నాయి. సీఎం జగన్ సర్కార్ కి చెడ్ద పేరు వచ్చింది. అయితే తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఈ ఉదయం 10గంటలకి తెలంగాణలో మద్యం షాపులు తెరచుకున్నాయి. మందు బాబులు మద్యం షాపులకి పెద్ద సంఖ్యలో వచ్చినా.. భౌతిక దూరం పాటిస్తున్నారు. మద్యం షాపుల విషయంలో సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. మద్యం షాపుల దగ్గర జనాలు గుమిగూడితే.. గంటలోనే షాపుని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మందు బాబులు భౌతిక దూరం పాటించేలా మద్యం షాపు యాజమాన్యం, ఇటు పోలీసులు శ్రద్ద తీసుకుంటున్నారు. మందు బాబుల్లోనూ.. కాస్త అవగాహనతో వ్యవహరించడంతో.. ఇబ్బంది అనేది లేకుండా తెలంగాణలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయ్.