విజయ్ ఎమోషనల్ ట్విట్.. వైరల్ !

ప్రపంచ దేశాలని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారికి వాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచదేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా వాక్సిన్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కరోనాకి వాక్సిన్ తో పాటు ఆకలికి వాక్సిన్ కూడా కనిపెట్టాలని కోలీవుడ్ స్టార్ హీరో ట్విట్ చేశారు.

“ఈ భూమి మీదా ఆకలి అనే బాధ కోసం కూడా ఒక వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆకలి అనే వ్యాధి ఎప్పటి నుంచో బాధ పెడుతోంది”  విజయ్ ట్విట్ చేశారు. ఇప్పుడీ ట్విట్ వైరల్ అవుతోంది. ఆకలి బాధల నుంచి పేదలను తప్పించాల్సిన బాధ్యత అందరికి ఉంది. దానికోసం పక్కా ప్రణాళీకలు రచించాలన్నది విజయ్ ట్విట్ ఆంతర్యం.