క్వారంటైన్ ప్రచారంపై భారతిరాజా స్పందన

సీనియర్‌ దర్శకుడు భారతిరాజాని క్వారంటైన్ లోకి ఉంచినట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నై నుంచి థానేకి వెళ్లిన భారతిరాజాను అక్కడి పోలీసులు, వైద్య బృందం క్వారంటైన్‌లో ఉంచినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై భారతీరాజా స్పందించారు. 

“భారతిరాజా క్వారంటైన్‌లో ఉన్నారంటూ ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. థానేలో ఉన్న నా సహోదరికి శస్త్రచికిత్స జరిగింది. ఆమెను చూడటం కోసం నేను థానేకి వెళ్లా. పోలీసుల నుంచి పాస్‌ తీసుకుని బయలుదేరా. అంతకుముందు చెన్నైలో టెస్టు కూడా చేయించుకున్నా. నెగిటివ్‌ వచ్చింది. థానే వెళ్లాక స్థానిక అధికారులకు నేనే విషయాన్ని చెప్ఫా అక్కడ కూడా నాకు పరీక్షలు జరిగాయి. మార్గమధ్యలో కూడా ఓ చోట పరీక్షలు చేశారు. మొత్తం మూడు చోట్లా నాకు నెగిటివ్‌ వచ్చింది.ఆస్పత్రిలో మా సోదరిని చూసొచ్చిన తర్వాత ఇంటికొచ్చాం. నేను ఆరోగ్యంగానే ఉన్నా. వదంతులు, తప్పుడు వార్తలను నమ్మకండి” అని భారతిరాజా తెలిపారు.