విశాఖలో విషవాయువు లీక్.. 5గురు మృతి.. 200 మందికిపైగా అస్వస్థత !

విశాఖపట్నంలో ఎల్ జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు (స్టెరైన్‌) లీకైంది. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3కి.మీ మేర వాయువు వ్యాపించింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో ఆసమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వందలాది పశువులు మృత్యువాత పడినట్టు సమాచారమ్.

ఎల్‌.జీ పాలిమర్స్‌ సౌత్‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. సుమారు 3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్‌ వాయువు లీకైంది. 4.30గంటలకు మాకు సమాచారం అందింది. లీకైన గ్యాస్‌ వల్ల ప్రాణ నష్టం ఉండదు. స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్‌ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు.