అత్తతో పవన్ మరోసారి

‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తగా నటించి మెప్పించింది సీనియర్ హీరోయిన్ నదియా. ఈ సినిమాలో పవన్, నదియాల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. తాజా సమాచారమ్ ప్రకారం పవన్ సినిమాలో మరోసారి నదియా కనిపించబోతుందని తెలుస్తోంది.

వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నపవన్ కల్యాణ్..  క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదో పిరియాడిక్ డ్రామ్. పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నదియాని సంప్రదించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయినట్టు సమాచారమ్. కరోనా ప్రభావం తగ్గాక ‘వకీల్ సాబ్’ సినిమాకి సంబంధించిన మిగిలిపోయిన షూటింగ్ ని పూర్తి చేసి.. క్రిష్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు పవన్.