ఆనందిలో సందీప్ హ్యాటిక్

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సూపర్ హిట్. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్‌ లో ఈ సినిమా వచ్చింది. జెమిని కిరణ్ నిర్మాత. ఆ తర్వాత ఈ బ్యానర్ లోనే బీరువా సినిమా చేశాడు సందీప్. బీరువా యావరేజ్ గా ఆడింది. ఇప్పుడీ బ్యానర్ లో సందీప్ హ్యాట్రిక్ సినిమా ఫిక్సయింది. సందీప్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాని ప్రకటించారు జెమినీ కిరణ్.

ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. భాను బోగవరపు కథ అందిస్తున్నారు. ఈ చిత్రం బ్యూటిఫుల్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని చెబుతున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మించే చిత్రంలో సందీప్ నటించనున్నాడు.